టీఆర్ఎస్ పేరు మార్చుకోవాల్సిందే.. కవిత కొత్త పార్టీపై ఎన్నికల సంఘం సీరియస్!

Published on: 04 Jul 2026, 02:38 AM
News Article

హైదరాబాద్, జూలై 04, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పేరుతో కవిత ఏర్పాటు చేయాలనుకుంటున్న కొత్త పార్టీకి ఎన్నికల సంఘం గట్టి షాకిచ్చింది. ఇప్పటికే ఉన్న పార్టీల పేర్లతో పోలిక ఉండటం మరియు ఆ పేరుపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం కావడంతో, టీఆర్ఎస్ పేరును కొనసాగించడం కుదరదని స్పష్టం చేస్తూ కవితకు సీఈసీ లేఖ రాసింది. ఈ మేరకు 15 రోజుల్లోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించాలని ఆదేశించిన ఎన్నికల సంఘం, ఒకవేళ గడువులోగా స్పందించకపోతే ఎలాంటి తదుపరి సమాచారం ఇవ్వకుండానే పార్టీ రిజిస్ట్రేషన్ దరఖాస్తును మూసివేస్తామని హెచ్చరించింది.