టీటీడీ చరిత్రలో ఆల్ టైమ్ రికార్డ్ ఆదాయం ఎంతో తెలుసా?
హైదరాబాద్, ఆగస్ట్ 4, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్ - తిరుమల): కలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారికి భక్తులు సమర్పిస్తున్న హుండీ కానుకలు నూతన చరిత్ర సృష్టిస్తున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా కేవలం ఒక్క జూలై నెలలోనే అత్యధికంగా రూ.140.28 కోట్ల హుండీ ఆదాయం నమోదై తిరుమల చరిత్రలో సరికొత్త రికార్డు నెలకొల్పింది. శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతుండటంతో హుండీ ఆదాయం అంతకంతకూ పెరుగుతోంది. ప్రస్తుత ఏడాది జనవరి నుంచి జూలై వరకు కేవలం ఏడు నెలల కాలంలోనే స్వామివారికి హుండీ ద్వారా అందిన మొత్తం ఆదాయం రూ.861 కోట్లకు చేరుకోవడం విశేషం. సాధారణ రోజుల్లోనూ శ్రీవారి హుండీ ఆదాయం రోజువారీగా రూ.3 కోట్లకు పైగా వస్తుండగా.. భక్తుల రద్దీ అధికంగా ఉండే ప్రత్యేక రోజుల్లో ఈ ఆదాయం ఏకంగా రూ.4 కోట్ల నుంచి రూ.5 కోట్లకు పైగా నమోదవుతున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.