టెట్ పరీక్షలో చతికిలబడ్డ ప్రభుత్వ ఉపాధ్యాయులు: 14,814 మంది ఫెయిల్!
Published on: 14 Jul 2026, 04:10 AM
హైదరాబాద్, జూలై 14, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): తెలంగాణలో ఇటీవల నిర్వహించిన టెట్ (TET) పరీక్ష ఫలితాలు ప్రభుత్వ ఉపాధ్యాయులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. గత నెలలో జరిగిన ఈ పరీక్షకు మొత్తం 23,623 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు హాజరుకాగా, వారిలో కేవలం 8,809 మంది (37.29%) మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాది 50% ఉత్తీర్ణత నమోదు కాగా, ఈసారి అది 37.29%కి పడిపోవడంతో 14,814 మంది ఉపాధ్యాయులు ఉత్తీర్ణత సాధించలేకపోయారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం, 2028 ఆగస్టు లోపు టెట్ ఉత్తీర్ణత సాధించని ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉద్యోగాలను కోల్పోయే ప్రమాదం ఉండటంతో, తాజా ఫలితాలు ఉపాధ్యాయ వర్గాల్లో తీవ్ర కలవరానికి దారితీస్తున్నాయి.