ట్రాన్స్‌జెండర్ తల్లి కావడం సాధ్యమేనా? తమన్నా సింహాద్రి ‘ప్రెగ్నెన్సీ’ పోస్ట్ వైరల్
హైదరాబాద్: బిగ్ బాస్ ఫేమ్, ప్రముఖ ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది. తాను గర్భవతినంటూ ప్రెగ్నెన్సీ ఫొటోను షేర్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు.
స్పెషల్ ట్రీట్‌మెంట్ సక్సెస్.. త్వరలోనే తల్లిని కాబోతున్నా!
తన ప్రెగ్నెన్సీ గురించి స్పందిస్తూ.. "స్పెషల్ ట్రీట్‌మెంట్ సక్సెస్ అయిందని, త్వరలోనే తల్లిని కాబోతున్నాను" అని తమన్నా వెల్లడించారు. అంతేకాదు, 20 రోజుల క్రితమే తనకు వివాహమై ఏడాది పూర్తయిందంటూ తన భర్త ఫొటోను కూడా రివీల్ చేశారు.
అబ్బాయిగా పుట్టి.. రాజకీయాల్లో సంచలనంగా మారి..
మస్తాన్‌గా పుట్టిన ఆమె, ముంబైలో లింగమార్పిడి చేయించుకుని తమన్నాగా మారిన సంగతి తెలిసిందే. గతంలో మంగళగిరిలో నారా లోకేష్‌పై, పిఠాపురంలో పవన్ కల్యాణ్‌పై పోటీ చేసి రాజకీయంగా పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు.
సోషల్ మీడియాలో చర్చ.. అది సాధ్యమేనా?
తమన్నా పోస్ట్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ట్రాన్స్‌జెండర్ ప్రెగ్నెన్సీ ఎలా సాధ్యమంటూ కొందరు సందేహాలు వ్యక్తం చేస్తుంటే, మరికొందరు ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు. శాస్త్రీయంగా ఇది ఎంతవరకు సాధ్యం అనే అంశంపై నెట్టింట పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అయితే ఇది నిజమైన ప్రెగ్నెన్సీనా లేక ఏదైనా షూటింగ్ కోసం చేసిన ప్రాంక్ ఆ అనేది తెలియాల్సి ఉంది.