డాడీ బైడెన్' ముసుగులో భారీ డ్రగ్స్ దందా..

Published on: 23 Jun 2026, 01:44 PM
News Article

కాలిఫోర్నియా, జూన్ 23 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): డార్క్‌నెట్ వేదికగా 'డాడీ బైడెన్' (DaddyBiden) అనే మారుపేరుతో నకిలీ మత్తుపదార్థాల విక్రయాలు జరుపుతున్న ముఠాను పోలీసులు గుట్టురట్టు చేశారు. కాలిఫోర్నియాకు చెందిన పీటర్ లామ్ అనే వ్యక్తి, అసలైన 'అడెరల్' (Adderall) మాత్రలుగా నమ్మిస్తూ, అందులో ప్రమాదకరమైన మెథాంఫేటమిన్ (meth) కలిపిన నకిలీ మాత్రలను విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నిందితుడు ఈ ఆపరేషన్ ద్వారా వేల సంఖ్యలో నకిలీ మాత్రలను వినియోగదారులకు కొరియర్ ద్వారా సరఫరా చేసినట్లు తేలింది. ఈ డార్క్‌నెట్ దందా ఎంతలా విస్తరించిందంటే.. ఇప్పటికే దాదాపు 10,000కు పైగా అమ్మకాలు పూర్తికావడమే కాకుండా, 5,000కు పైగా పాజిటివ్ రివ్యూలు కూడా పొందింది. మత్తు మందుల మాఫియా డార్క్‌నెట్‌ను వాడుకుంటూ ఇలా అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుండటంపై దర్యాప్తు సంస్థలు సీరియస్‌గా స్పందించాయి.