తల్లి జ్ఞాపకార్థం విద్యార్థులు, వృద్ధులకు చేయూత!

Published on: 25 Jul 2026, 01:59 AM
News Article

మసీద్‌గూడెం, జూలై 25, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): మసీద్‌గూడెం గ్రామానికి చెందిన మర్రి సరస్వతి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ఘనంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామ సర్పంచ్ మర్రి వంశీదర్ రెడ్డి, కుమార్తె కళ్లెం మానస రెడ్డి, అల్లుడు కార్తీక్ రెడ్డిల ఆధ్వర్యంలో మొదటగా తమ తల్లి చిన్నతనంలో విద్యాభ్యాసం చేసిన నేలపట్ల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నోట్‌బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు, పండ్లు, స్వీట్లు పంపిణీ చేయడంతో పాటు పాఠశాల అవసరాల నిమిత్తం ఉపాధ్యాయులకు ఒక బీరుటాను అందజేశారు. అనంతరం పెద్దకొండూర్‌లోని సాయి యాదాద్రి సేవా ఆశ్రమంలో వృద్ధులకు పండ్లు, స్వీట్లు పంపిణీ చేసి, ఆశ్రమ అవసరాల కోసం మరో బీరుటాను బహూకరించారు. తల్లిదండ్రుల జ్ఞాపకాలను సమాజ సేవ ద్వారా చిరస్థాయిగా నిలుపుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని నిర్వాహకులు ఈ సందర్భంగా పేర్కొనగా, ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మర్రి రాంరెడ్డి, నేలపట్ల సర్పంచ్ గంగాపురం నగేష్, మందోళ్లగూడెం ఉపసర్పంచ్ సుర్కంటి శ్రీధర్ రెడ్డి, పెద్దకొండూర్ మాజీ ఎంపీటీసీ బద్దం కొండల్ రెడ్డి, పెద్దకొండూర్ ఉపసర్పంచ్ పిన్నిటి శ్రీనివాస్ రెడ్డితో పాటు పలువురు కుటుంబ సభ్యులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.