తిరుచ్చి ఈస్ట్ ఎన్నికల బరిలో లారెన్స్..? జూన్ 11న క్లారిటీ ఇస్తానంటూ కీలక ప్రకటన!
హైదరాబాద్ న్యూస్‌టైమ్, చెన్నై, జూన్ 08, 2026: ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు రాఘవ లారెన్స్ రాజకీయ ఎంట్రీపై తమిళనాడులో జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. ఆయన తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గం నుండి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారంటూ మీడియాలో వస్తున్న వార్తలపై స్వయంగా లారెన్స్ స్పందించారు. ఈ విషయంపై ఆయన సామాజిక మాధ్యమాల వేదికగా ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. "నేను తిరుచ్చి ఈస్ట్ నుండి పోటీ చేస్తున్నట్లు వస్తున్న వార్తలపై క్లారిటీ ఇవ్వాలని మీడియా మిత్రులు నన్ను కోరుతున్నారు. ప్రస్తుతం నేను 'బెంచ్' (Benz) సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాను, ఈ షెడ్యూల్ జూన్ 10తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో, నా తల్లి ఆశీస్సులతో నా జీవితానికి సంబంధించిన ఒక అత్యంత కీలకమైన నిర్ణయాన్ని జూన్ 11 (గురువారం) ఉదయం 9:30 గంటలకు అధికారికంగా ప్రకటిస్తాను" అని లారెన్స్ పేర్కొన్నారు. దీంతో ఆయన రాజకీయ అరంగేట్రం దాదాపు ఖాయమైందని, జూన్ 11న ఆయన ఏం చెప్పబోతున్నారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.