తుని కేసులో కుక్క మరణానికి అసలు కారణం ఇదే!
Published on: 26 Jun 2026, 04:11 AM
హైదరాబాద్, జూన్ 26 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): ఆంధ్రప్రదేశ్‌లోని తునిలో తీవ్ర సంచలనం సృష్టించిన చిన్నారి మిస్సింగ్ కేసులో కీలకమైన పెంపుడు కుక్క మృతికి సంబంధించిన పోస్ట్‌మార్టం రిపోర్ట్ ఎట్టకేలకు విడుదలైంది. ఆ కుక్క మరణం వెనుక ఎలాంటి అనుమానాస్పద కోణాలు లేవని, కేవలం అనారోగ్య కారణాల వల్లే అది చనిపోయిందని వెటర్నరీ నిపుణులు తమ నివేదికలో స్పష్టం చేశారు. గత కొన్ని రోజులుగా సదరు పెంపుడు కుక్క ఆహారం తీసుకోకపోవడం, దానికి తోడు తీవ్ర అనారోగ్యానికి గురికావడం వల్లే మృతి చెందిందని పోస్ట్‌మార్టం రిపోర్ట్ ద్వారా అధికారికంగా నిర్ధారణ అయ్యింది. చిన్నారి అదృశ్యం కేసులో ఈ కుక్క మరణంపై పలు అనుమానాలు వ్యక్తమైన నేపథ్యంలో, తాజా మెడికల్ రిపోర్ట్‌తో ఆ సస్పెన్స్‌కు తెరపడినట్లయింది.