తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడికి షోకాజ్ నోటీసులు

Published on: 15 Jul 2026, 05:54 AM
News Article

హైదరాబాద్, జూలై 15, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): తెలంగాణ కాంగ్రెస్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ శివ చరణ్ రెడ్డిపై ఇండియన్ యూత్ కాంగ్రెస్ (IYC) అధిష్టానం కఠిన చర్యలకు ఉపక్రమించింది. పార్టీలోని సీనియర్ నేతలను, గౌరవనీయులైన మహిళా నాయకురాళ్లను మరియు బీసీ కులాల పట్ల శివ చరణ్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో, ఆయనకు పార్టీ హైకమాండ్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తూ, నాయకత్వాన్ని మరియు సామాజిక వర్గాలను కించపరిచేలా ఆయన వ్యవహరించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఐవైసీ, ఈ వ్యవహారంపై 3 రోజుల్లోగా లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఎవరూ ప్రవర్తించరాదని, అటువంటి వారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవని హైకమాండ్ హెచ్చరించడంతో, రాష్ట్ర రాజకీయాల్లో ఈ నోటీసుల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.