తెలంగాణ సెక్రటేరియట్‌లో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అధికారులు
Published on: 10 Sep 2026, 11:57 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 10, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): తెలంగాణ సచివాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సంచలన దాడులు నిర్వహించారు. సెక్రటేరియట్‌లోని గుడి వద్ద లంచం తీసుకుంటూ ప్రభుత్వ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. సీఎం రిలీఫ్ ఫండ్‌కు సంబంధించి మంజూరైన రూ. 2 లక్షల బిల్లు ఇందుకు రూ. 1 లక్ష లంచం డిమాండ్ చేసినట్లు తేలింది. ఈ కేసుకు సంబంధించి సెక్షన్ ఆఫీసర్ వినోద్‌తో పాటు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి రాఘవేంద్రను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని తదుపరి విచారణ నిమిత్తం నాంపల్లిలోని ఏసీబీ కార్యాలయానికి తరలించారు. సచివాలయ内లో లంచం తీసుకుంటూ అధికారులు పట్టుబడడం తీవ్ర కలకలం రేపింది.