"దమ్ముంటే మంత్రి పదవి తెచ్చుకోండి": కడియం శ్రీహరిపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!

Published on: 09 Jul 2026, 10:05 AM
News Article

హైదరాబాద్, జూలై 09, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): సీనియర్ నేత, ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మంత్రి కొండా సురేఖ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. "ఎమ్మెల్యే పదవిలో ఇమడలేకపోతే రాజీనామా చేసి ఇంట్లో కూర్చోండి, దమ్ముంటే మంత్రి పదవి తెచ్చుకోండి" అంటూ ఆమె సవాల్ విసిరారు. కడియం కాంగ్రెస్‌లో చేరిన నాటి నుంచే పార్టీలో అంతర్గత వివాదాలు మొదలయ్యాయని ఆరోపించిన సురేఖ, ఆయనకు అంత నిజాయితీ ఉంటే పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలిచి చూపించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌కు ఫిర్యాదు చేశానని, ఈ నెల 14న ఏఐసీసీ ప్రతినిధి మీనాక్షి నటరాజన్‌ను కలిసి కూడా ఆయన తీరుపై ఫిర్యాదు చేస్తానని మంత్రి స్పష్టం చేశారు.