ధరణి, భూ భారతి పోర్టల్స్‌లో అక్రమాలపై ప్రత్యేక కమిటీ
Published on: 02 Jul 2026, 03:43 AM
హైదరాబాద్, జూలై 02, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): ధరణి మరియు భూ భారతి పోర్టల్స్‌లో చోటుచేసుకున్న అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిందని రెవెన్యూ కార్యదర్శి లోకేశ్ కుమార్ వెల్లడించారు. ఈ అక్రమాలకు పాల్పడిన బాధ్యులను గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.