నడిరోడ్డుపై పావలా శ్యామల..
- పైసల్లేవని చేర్చుకోని వైనం..
- అర్థరాత్రి ఫుట్‌పాత్‌పై దింపేసిన క్యాబ్ డ్రైవర్
- కూకట్‌పల్లి వై జంక్షన్ వద్ద దీనస్థితి..
- ఆర్కే ఫౌండేషన్‌కు తరలించిన పోలీసులు
హైదరాబాద్ న్యూస్ టైమ్, హైదరాబాద్: ప్రముఖ సీనియర్ హాస్య నటి పావలా శ్యామల నడిరోడ్డుపై దిక్కుతోచని దీనస్థితిలో పడి ఉన్న అత్యంత ఆవేదనకర ఘటన కూకట్‌పల్లిలో వెలుగుచూసింది. గత కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆమె, నిన్న రాత్రి అత్యవసర చికిత్స నిమిత్తం కూకట్‌పల్లిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లగా.. వైద్యానికి సరిపడా డబ్బులు లేవనే నెపంతో అక్కడి యాజమాన్యం ఆమెను ఆసుపత్రిలో చేర్చుకోవడానికి నిష్ఠురంగా నిరాకరించింది. దాంతో వెనుతిరిగిన ఆమెను అర్థరాత్రి సమయంలో ఒక క్యాబ్ డ్రైవర్ తీవ్ర అమానవీయంగా కూకట్‌పల్లి వై జంక్షన్ వద్ద ఉన్న ఫుట్‌పాత్‌పై దింపి వెళ్ళిపోయాడు. నడిరోడ్డుపై అల్లాడుతున్న శ్యామలను గమనించిన స్థానికులు తక్షణమే పోలీసులకు సమాచారం అందించగా, మానవత్వంతో స్పందించిన కూకట్‌పల్లి పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ఆమెను సురక్షితంగా ఆర్కే ఫౌండేషన్‌కు తరలించి ఆశ్రయం కల్పించారు. ఒకప్పటి స్టార్ నటి ప్రస్తుత దుస్థితి చూసి స్థానికులు, సినీ అభిమానులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.