నా టార్గెట్ రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ కాదు: కొండా సుష్మిత VIDEO

Published on: 21 Aug 2026, 04:23 AM

హైదరాబాద్, ఆగస్ట్ 21, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): తన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించినవి కాదని, కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మాత్రమే లక్ష్యంగా చేసుకున్నాయని కొండా సుష్మిత స్పష్టం చేశారు. ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అంటే తనకు ఎంతో గౌరవం ఉందని ఆమె తెలిపారు. అయితే, రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి మరియు ఆయన కుటుంబ సభ్యులు విపరీతమైన అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని, అందుకే తాను రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశానని ఆమె పేర్కొన్నారు. పార్టీలో ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించడానికి ఆయనకి ఏం అధికారముందని ఆమె ప్రశ్నించారు. భవిష్యత్తులో అవసరమైతే తాను ఇండిపెండెంట్ అభ్యర్థిగా కూడా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని కొండా సుష్మిత స్పష్టం చేశారు.