నారా బ్రాహ్మణి, లోకేష్ దంపతుల ఆధ్వర్యంలో 'ఏకాదశ మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం'
హైదరాబాద్ న్యూస్‌టైమ్, అమరావతి: లోకకల్యాణార్థం మరియు రాష్ట్ర శ్రేయస్సును కాంక్షిస్తూ నారా లోకేష్, బ్రాహ్మణి దంపతులు ఒక అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించారు. నేడు వారి నివాసంలో అత్యంత వైభవంగా, శాస్త్రోక్తంగా 'ఏకాదశ మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం' సంకల్పించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ సాగిన ఈ మహారుద్రాభిషేకంలో నారా దంపతులు భక్తిశ్రద్ధలతో పాల్గొని శివునికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. తమ కుటుంబ సభ్యులందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని కోరుకోవడంతో పాటు.. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పచ్చగా ఉండాలని, రాబోయే రోజుల్లో రాష్ట్రంలో శాంతి, సుభిక్షం, అఖండ ఆర్థిక పురోగతి సిద్ధించాలని ఈ సందర్భంగా వారు ప్రత్యేకంగా ప్రార్థించారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసమే ఈ ప్రత్యేక యజ్ఞాన్ని సంకల్పించినట్లు ఈ సందర్భంగా పండితులు తెలిపారు. ఈ విశేష పూజా కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.