"నిన్ను సిమెంట్ డ్రమ్ములో వేసి చంపేస్తా".. భార్య ఫేస్‌బుక్ పోస్ట్ చూసి భర్త ఏం చేశాడో తెలుసా?

Published on: 19 Mar 2026, 11:41 AM
News Article
ఉత్తరప్రదేశ్: సోషల్ మీడియా పుణ్యమా అని ఒక భార్య తన ప్రియుడి కోసం వేసిన ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అవ్వడమే కాకుండా, భర్త తీసుకున్న నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ఒక మహిళ తన భర్తను వదిలించుకోవడానికి, గొంతు వరకు సిమెంట్‌లో ముంచి డ్రమ్ములో పెట్టి చంపేస్తానంటూ తన ప్రియుడితో కలిసి ఫేస్‌బుక్‌లో ఒక భయంకరమైన పోస్ట్ పెట్టింది.

ట్విస్ట్ ఏంటంటే: ఆ పోస్ట్‌ను అనుకోకుండా చూసిన భర్త ఒక్కసారిగా షాక్ తిన్నాడు. తనను అంత దారుణంగా చంపాలనుకుంటున్న భార్యతో కలిసి ఉండటం కంటే, ఆమెను వదిలించుకోవడమే మంచిదని భావించాడు. ఏ మాత్రం గొడవ పడకుండా, పంచాయితీ సమక్షంలో ఆమెను తన ప్రియుడితో కలిసి వెళ్ళిపోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. 'నీకు నచ్చిన వాడితోనే ఉండు, నన్ను మాత్రం ప్రాణాలతో వదిలేయ్' అంటూ అతను తీసుకున్న నిర్ణయం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.