నిరీక్షణ ముగిసింది.. త్వరలో కీలక ప్రకటన చేస్తా: కొండా సురేఖ
Published on: 04 Sep 2026, 07:18 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 4, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన తరుణంలో మాజీ మంత్రి కొండా సురేఖ రాజకీయంగా సంచలన ప్రకటనకు సిద్ధమయ్యారు. సోషల్ మీడియా వేదికగా ఆమె చేసిన తాజా పోస్ట్ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. "The Wait Is Almost Over... A Big Update Is Coming Soon. Stay Tuned, Telangana! ✊🔥" అంటూ ఆమె తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ పెట్టారు. మంత్రివర్గం నుంచి తనను తొలగించడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆమె, త్వరలోనే తన భవిష్యత్ రాజకీయ ప్రయాణంపై ఒక స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించనున్నట్లు ఈ పోస్ట్ ద్వారా స్పష్టమవుతోంది. ఆమె పార్టీ మారతారా? లేక కొత్త రాజకీయ సమీకరణాలకు తెరలేపుతారా? అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.