నిరుద్యోగుల నిరసన సెగ: 2 లక్షల ఉద్యోగాల కోసం ఉస్మానియాలో భారీ ర్యాలీ!
Published on: 08 Jul 2026, 05:50 AM
హైదరాబాద్, జూలై 08, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం వెంటనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు 20 వేల పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని, అలాగే ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధికి ప్రకటించిన రూ. 1,000 కోట్ల నిధులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, బీఆర్ఎస్వీ మరియు ఇతర విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో వందలాది మంది నిరుద్యోగ యువత ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ లైబ్రరీ నుంచి ఆర్ట్స్ కాలేజీ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. నిరుద్యోగుల ఆశలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని మండిపడిన విద్యార్థి నాయకులు, హామీలను నెరవేర్చే వరకు పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.