నూతన ఎస్‌ఐ సీత పాండును కలిసి అభినందనలు తెలిపిన ఐఎన్టియుసి ప్రతినిధులు!
Published on: 08 Jul 2026, 02:58 PM
సంస్థాన్ నారాయణపూర్, జూలై 08, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): యాదాద్రి భువనగిరి జిల్లా, సంస్థాన్ నారాయణపూర్ మండల పోలీస్ స్టేషన్‌లో నూతన ఎస్‌ఐగా సీత పాండు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఐఎన్టియుసి మండల అధ్యక్షులు దౌలా గణేష్ ఆధ్వర్యంలో పలువురు నాయకులు ఎస్‌ఐని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ సీత పాండు మాట్లాడుతూ, మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజల సహకారం ఎంతో అవసరమని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ పారదర్శకమైన పోలీసు సేవలను అందించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టియుసి నాయకులు దౌల ముత్యాలు తదితరులు పాల్గొన్నారు.