నెల రోజులు తిరక్కముందే నవ దంపతుల ఆత్మహత్య.. అసలేం జరిగింది?
Published on: 02 May 2026, 09:05 AM
కూకట్‌పల్లిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పెద్దలను ఒప్పించి మార్చి 8న ప్రేమ వివాహం చేసుకున్న నవ దంపతులు కార్తీక్, మంజుల నెల రోజులు తిరక్కముందే ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఒకరు ఉరివేసుకోగా, మరొకరు విషం తాగి బలవన్మరణం చెందారు. వీరి ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.