పంతంగి గ్రామంలో జెడ్పీసీఈవో శోభారాణి ఆకస్మిక పర్యటన

Published on: 11 Aug 2026, 04:04 PM
News Article

చౌటుప్పల్, ఆగస్ట్ 11, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామంలో జిల్లా పరిషత్ సీఈవో శోభారాణి మంగళవారం పర్యటించారు. గ్రామంలోని ఉన్నత పాఠశాలను సందర్శించిన ఆమె, విద్యార్థులకు నూతన పాఠశాల దుస్తులను (స్కూల్ డ్రెస్) పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి పచ్చదనాన్ని చాటారు. పాఠశాల సందర్శన అనంతరం గ్రామంలో పర్యటించిన జెడ్పీసీఈవో.. పూర్తయిన ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. ఇంకా పెండింగ్‌లో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ స్థితిగతులపై హౌసింగ్ ఏఈ పవన్ కళ్యాణ్‌ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పనులను వేగవంతం చేసి అర్హులైన అందరికీ లబ్ధి చేకూర్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ మండల ఎంపీడీవో శ్రీలత, గ్రామ సర్పంచ్ శ్రీలత సుందర్, పంచాయతీ కార్యదర్శి పద్మజ, హౌసింగ్ ఏఈ పవన్ కళ్యాణ్, స్కూల్ హెడ్‌మాస్టర్ సత్యనారాయణ, విద్యార్థిని విద్యార్థులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.