సంస్థాన్ నారాయణపురం, యాదాద్రి భువనగిరి, నవంబర్ 6, 2026 (హైదరాబాద్ న్యూస్టైమ్): యాదాద్రి భువనగిరి జిల్లా, సంస్థాన్ నారాయణపురం మండల పరిధిలోని పల్లగట్టు తండాలో లబ్ధిదారులు వర్త్య సోనా నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని సర్పంచ్ కేలోతు విజయేందర్ నాయక్, సంస్థాన్ నారాయణపురం పీఏసీఎస్ డైరెక్టర్ బానోతు కిషన్ నాయక్ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సొంతింటి కలను సాకారం చేసేలా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేయడం ఎంతో అభినందనీయమని అన్నారు. పేదల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్న తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి లబ్ధిదారులు, గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బానోతు సురేష్, బానోతు జాను, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కేలోతు బిచ్చు నాయక్, బానోతు శీను, వర్త్య బాబోజీ, వర్త్య బాల, నూతన గృహలబ్ధిదారులు మరియు పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.