పవన్ కళ్యాణ్ ఆ శాఖ ఎందుకు తీసుకున్నారంటే?.. గుట్టు విప్పిన నాగబాబు!
Published on: 29 Jun 2026, 10:57 AM
హైదరాబాద్, జూన్ 29 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అరకు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేయబోతుందని ఆ పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు సంచలన ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేవలం గిరిజన ప్రాంతాల సంక్షేమం, వెనుకబడిన గ్రామాల సమగ్ర అభివృద్ధిని కాంక్షించే పక్కా సంకల్పంతోనే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలను తీసుకున్నారని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూనే, గిరిజన ఓటర్లకు మరింత చేరువయ్యేలా జనసేన అరకు రీజియన్‌పై ప్రత్యేక ఫోకస్ పెట్టిందని, రాబోయే రోజుల్లో ఈ ప్రాంత గిరిజనుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పార్టీ ముందుకు సాగుతుందని నాగబాబు వివరించారు.