పార్టీ పేరుపై వెనకడుగు వేసేది లేదు: న్యాయపోరాటానికి సిద్ధమంటున్న కవిత!
Published on: 04 Jul 2026, 06:27 AM
హైదరాబాద్, జూలై 04, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పేరును మార్చుకోవాలంటూ ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాలపై మాజీ ఎమ్మెల్సీ కవిత తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పార్టీ పేరు విషయంలో తాము వెనకడుగు వేసే ప్రసక్తే లేదని, ప్రత్యామ్నాయ పేర్లు ఇచ్చే ఆలోచన లేదని ఆమె స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం నిర్ణయం అశాస్త్రీయమని పేర్కొన్న కవిత, ఈ అంశంపై తాను న్యాయపోరాటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. నిబంధనల ప్రకారమే తాము దరఖాస్తు చేసుకున్నామని, ఇలాంటి ఒత్తిళ్లకు లోబడేది లేదని ఆమె తేల్చి చెప్పారు.