పార్టీ లైన్ దాటితే సీఎం రేవంత్ రెడ్డినైనా ఉపేక్షించం..

Published on: 25 Aug 2026, 07:45 AM
News Article

హైదరాబాద్, ఆగస్ట్ 25, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): కాంగ్రెస్ పార్టీలో పూర్తిస్థాయి ప్రజాస్వామ్యం ఉందని, అయితే పార్టీ గీత దాటి ప్రవర్తిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. పార్టీ అనుసరించే నియమ నిబంధనలు ప్రతి ఒక్కరికీ సమానమేనని తేల్చిచెప్పారు. ఈ నిబంధనలు కేవలం సాధారణ కార్యకర్తలకే కాకుండా తనతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, రాష్ట్రంలోని మంత్రులందరికీ ఒకే విధంగా వర్తిస్తాయని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. పార్టీ శ్రేణులంతా అనుశిక్షణతో మెలగాలని, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.