పిల్పల్‌ పహాడ్‌లో ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు

Published on: 14 Jul 2026, 02:39 PM
News Article

పిల్పల్‌ పహాడ్, జూలై 14, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు, పిల్పల్ పహాడ్ గ్రామంలో నిర్వహిస్తున్న ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి, ఎస్‌ఐఆర్ ఇన్‌చార్జి అర్థ వెంకట్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పులనగారి నాగేశ్వరి అశ్విన్ గౌడ్, వార్డు సభ్యులు, బిఎల్‌ఏలు, బిఎల్‌ఓలు మరియు సంబంధిత అధికారులతో కలిసి ఆయన ఓటరు జాబితాలో మార్పులు, చేర్పుల ప్రక్రియను, దరఖాస్తుల స్వీకరణను మరియు ప్రజలకు అందుతున్న సేవలను క్షుణ్ణంగా సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఈ ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని ఎంతో పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించడమే కాకుండా, ప్రతి అర్హులైన ఓటరు తమ వివరాలను సరిచూసుకోవాలని, అవసరమైన మార్పులు, చేర్పులు చేసుకోవాలని స్థానిక ప్రజలకు విజ్ఞప్తి చేశారు.