పెద్దమ్మ తల్లి కళ్యాణ మహోత్సవానికి రండి.. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఆహ్వానం
హైదరాబాద్ న్యూస్‌టైమ్, యాదాద్రి భువనగిరి, జూన్ 13, 2026: యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో వెలసిన శ్రీశ్రీశ్రీ పెద్దిరాజు పెద్దమ్మ తల్లి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న పెద్దమ్మ తల్లి కళ్యాణ మహోత్సవానికి మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అధికారికంగా ఆహ్వానం అందింది. సంస్థాన్ నారాయణపురం సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి, మాజీ ఎంపీపీ గుత్తా ఉమా ప్రేమ్‌చందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ దోనూరు జైపాల్ రెడ్డిల ఆధ్వర్యంలో ముదిరాజ్ సంఘం నాయకులు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిసి కళ్యాణ మహోత్సవ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం అధ్యక్షులు ఉప్పరగొని యాదయ్య, మాజీ అధ్యక్షులు నిమ్మల నాగేష్ ముదిరాజ్, ఉపాధ్యక్షులు దుర్గం లాలయ్య, పెద్దమ్మ గుడి చైర్మన్ గట్టు గోపాల్, మాజీ చైర్మన్ పూలమోని వెంకటేష్ పాల్గొన్నారు. వీరితో పాటు వార్డు మెంబర్లు నీళ్ల అనిత శంకర్, చింతల శైలజ సత్యనారాయణ, ఉప్పరగొని రమేష్, దుర్గం జంగయ్య, ఉప్పర గోని యాదయ్య, వెంకటేశం మరియు ముదిరాజ్ సంఘం నాయకులు, గ్రామ ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.