సంస్థాన్ నారాయణపురం, నవంబర్ 24, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) అండగా నిలుస్తోంది. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రత్యేక చొరవతో మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను సంస్థాన్ నారాయణపురం గ్రామ సర్పంచ్ గజం అనిత సత్యనారాయణ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మొత్తం ఆరుగురు బాధిత కుటుంబాలకు రూ.2,45,500 విలువైన చెక్కులను ఆమె అందజేశారు.
చెక్కులు అందుకున్న లబ్ధిదారుల వివరాలు:
- చెరిపెల్లి రాజారాములు – రూ.60,000
- కుక్కల లక్ష్మయ్య – రూ.60,000
- బండమీది మమత (భర్త సాయికుమార్) – రూ.60,000
- బొమ్మకంటి ముత్యాలమ్మ (భర్త లింగయ్య) – రూ.28,000
- గుజ్జరి శ్రవణ్ కుమార్ – రూ.24,500
- గజం కళావతి (భర్త కనకయ్య) – రూ.13,000
కష్టకాలంలో తమకు ఆర్థిక సాయం మంజూరు చేయించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి, చెక్కులను అందించిన సర్పంచ్‌కు లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షులు గజం సత్యనారాయణ, పద్మశాలి కుల సంఘం అధ్యక్షులు గజం సత్యనారాయణ, కార్యదర్శి పగిడిమర్రి భావనాఋషి, వార్డు సభ్యులు గజం రమేష్, జెల్ల మార్కండేయ, డాక్టర్ గంజి వెంకటేశ్వర్లు, గోలి సాంబయ్య, పెంబల్ల కృష్ణ, పున్న చంద్రశేఖర్, గూడ పవన్, గజం శ్రీకాంత్, గజం సునీల్, బావండ్ల నాగరాజు, కొంగరి అశోక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.