పేదలకు అండగా సీఎంఆర్ఎఫ్ పథకం: జనగాంలో చెక్కులు అందుకున్న బాధితులు

Published on: 11 Sep 2026, 03:33 PM
News Article

సంస్థాన్ నారాయణపురం, సెప్టెంబర్ 11, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): సంస్థాన్ నారాయణపురం మండల పరిధిలోని జనగాం గ్రామంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో సీఎం రిలీఫ్ ఫండ్ (CMRF) చెక్కులను పంపిణీ చేశారు. గ్రామ సర్పంచ్ లోడె రఘు గౌడ్ చేతుల మీదుగా అర్హులైన లబ్ధిదారులు నాతి వెంకటయ్య, చుక్క వీరయ్య, బ్రహ్మచారి తదితరులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ రఘు గౌడ్ మాట్లాడుతూ, అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో అండగా నిలుస్తుందని తెలిపారు. ప్రజలకు సంక్షేమ ఫలాలు అందేలా నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు గడ్డం రవి, ఉప సర్పంచ్ ఎర్ర సుశీల లక్ష్మయ్య, వార్డు మెంబర్ చుక్క అంజయ్య, కాంగ్రెస్ నాయకులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.