పొంగులేటి 'శాడిజం'.. ప్రమోషన్లు బంద్!
హైదరాబాద్ న్యూస్ టైమ్ - హైదరాబాద్: సమాచార శాఖలో ఉద్యోగుల పదోన్నతుల ఫైల్‌ను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నెలల తరబడి తొక్కిపెట్టడం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. అడిషనల్ డైరెక్టర్ స్థాయి నుంచి కింది స్థాయి వరకు పదోన్నతులు కల్పించాలని డిపార్ట్‌మెంట్ ప్రమోషన్ కమిటీ (DPC) ఫైల్ క్లియర్ చేసినప్పటికీ, గత మూడు నెలలుగా మంత్రి తన వద్దే ఉంచుకుని సతాయిస్తుండడంతో ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పదవీ విరమణ సమయం దగ్గరపడుతున్నా ప్రమోషన్లు రాకపోవడంతో ఆవేదన చెందుతున్న సిబ్బంది, మంత్రి ఏదో ఆశించి తమను వేధిస్తూ శాడిస్టిక్ ఆనందం పొందుతున్నారని గుసగుసలాడుకుంటున్నారు. అడిషనల్ డైరెక్టర్ పదోన్నతి ఒక్కటి క్లియర్ అయితే పదుల సంఖ్యలో కింది స్థాయి అధికారులకు ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉన్నా, మంత్రి పట్టువిడకపోవడంతో శాఖలో పరిపాలన స్తంభించిందని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి.