పోక్సో (POCSO) కోర్టు సంచలన తీర్పు..కానిస్టేబుల్‌కు 31 ఏళ్ల జైలు శిక్ష!
- పోక్సో (POCSO) కోర్టు సంచలన తీర్పు..
- బాధితురాలికి రూ. 1 లక్ష పరిహారం చెల్లించాలని ఆదేశం
- ఆరేళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం నేరగాడికి..
- కఠిన దండన విధించిన న్యాయస్థానం
హైదరాబాద్ న్యూస్ టైమ్, హైదరాబాద్: శాంతిభద్రతలను కాపాడాల్సిన రక్షకుడే భక్షకుడిగా మారి మైనర్ బాలికపై దారుణానికి ఒడిగట్టిన కేసులో కోర్టు సంచలన తీర్పునిస్తూ నిందితుడైన పోలీస్ కానిస్టేబుల్‌కు 31 ఏళ్ల కఠిన జైలు శిక్ష విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని తాడ్‌బండ్ ప్రాంతంలో నివాసముండే ఓ మైనర్ బాలికపై 2020లో వరదరాజ్ సుధేష్ అనే పోలీస్ కానిస్టేబుల్ లైంగిక దాడికి పాల్పడటంతో బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అప్పట్లో పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదైంది. ఈ ఘోర ఉదంతంపై గత ఆరేళ్లుగా సాగిన సుదీర్ఘ కోర్టు విచారణ అనంతరం, నిందితుడిపై నేరం రుజువు కావడంతో న్యాయస్థానం కఠిన జైలు శిక్షతో పాటు బాధితురాలికి రూ. 1 లక్ష పరిహారంగా చెల్లించాలని సదరు కానిస్టేబుల్‌ను ఆదేశించింది. రక్షణ కల్పించాల్సిన స్థానంలో ఉండి ఇంతటి దారుణానికి ఒడిగట్టిన ఖాకీకి కోర్టు కఠిన శిక్ష విధించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.