పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Published on: 29 Jul 2026, 02:43 PM
News Article

హైదరాబాద్, జూలై 29, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): రాష్ట్రంలో భారీగా ఉండిన ఖాళీల మేరకు 20 వేల పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తారని ఆశించిన నిరుద్యోగులకు నిరాశే ఎదురైంది. డిమాండ్ చేసిన స్థాయిలో కాకుండా కేవలం 7 వేలకు పైచిలుకు పోస్టులతోనే సరిపెట్టడంపై సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక బోర్డు (TSLPRB) రాష్ట్రంలో వివిధ విభాగాల భర్తీ కోసం మొత్తం 4 నోటిఫికేషన్లను విడుదల చేసింది. పోలీస్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF), ఫైర్, ఎమర్జెన్సీ, జైలు శాఖల్లో మొత్తం 7,437 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.

విభాగాల వారీగా ఖాళీల వివరాలు:

  • ఎస్‌ఐ పోస్టులు: 148
  • సివిల్ కానిస్టేబుల్ పోస్టులు: 3,697
  • ఏఆర్ కానిస్టేబుల్ పోస్టులు: 1,052
  • ఎస్‌పీఎఫ్ కానిస్టేబుల్ పోస్టులు: 1,380
  • ఎస్‌పీఎఫ్ ఎస్‌ఐ పోస్టులు: 44
  • ఫైర్ ఫైటర్ పోస్టులు: 751

ఖాళీల సంఖ్య ఆశించిన స్థాయిలో లేకపోయినా, అర్హులైన అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకుని ప్రిపరేషన్ వేగవంతం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.