ప్రణాళికా బోర్డు వైస్ చైర్మన్ పదవి నుంచి డాక్టర్ జి. చిన్నారెడ్డిని తొలగించిన ప్రభుత్వం
Published on: 03 Sep 2026, 09:17 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 3, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): తెలంగాణ రాజకీయాల్లో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా బోర్డు వైస్ చైర్మన్ పదవి నుంచి డాక్టర్ జి. చిన్నారెడ్డిని తక్షణమే తొలగిస్తూ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ పదవి నుంచి ఆయన్ని తొలగించిన తక్షణమే.. ఆ స్థానంలో ఎస్. గడ్వాల్ విజయలక్ష్మిని ప్రణాళికా బోర్డు కొత్త వైస్ చైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ తాజా నిర్ణయాలు రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.