ప్రపంచానికి గుడ్ న్యూస్

Published on: 08 Apr 2026, 01:48 PM
News Article

వాషింగ్టన్: ప్రపంచం వినాశనం అంచుకు చేరుకుందన్న భయాల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఒక నిర్ణయం అంతర్జాతీయ మార్కెట్లలో జోష్ నింపింది. ఇరాన్‌తో యుద్ధం విషయంలో "మొత్తం నాగరికతనే అంతం చేస్తా" అంటూ గతంలో చేసిన హెచ్చరికల నుంచి ట్రంప్ వెనక్కి తగ్గడంతో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి.

  • ట్రంప్ వెనడుగు: ఇరాన్‌తో యుద్ధం ముదురుతుందన్న తరుణంలో ట్రంప్ తన కఠిన వైఖరిని సడలించారు. ఈ యుద్ధ భయం పోవడంతో ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకున్నాయి.
  • క్రూడాయిల్ ధరలు డౌన్: యుద్ధ మేఘాలు తొలగిపోవడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు (Oil) ధరలు భారీగా తగ్గాయి. ప్రస్తుతం బ్యారెల్ ధర $90 మార్కుకు చేరుకుంది. ఇది భారత్ వంటి దేశాలకు పెట్రోల్ ధరల పరంగా ఊరటనిచ్చే అంశం.
  • దూసుకుపోతున్న మార్కెట్లు: యుద్ధం ఆగిపోవడంతో గ్లోబల్ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇన్వెస్టర్లలో నమ్మకం పెరగడంతో ప్రపంచవ్యాప్తంగా షేర్ల ధరలు పెరుగుతున్నాయి.