ప్రమాణస్వీకారోత్సవానికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి ఆహ్వానం
Published on: 11 Aug 2026, 04:06 PM
హైదరాబాద్, ఆగస్ట్ 11, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్ - చౌటుప్పల్): యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని దేవాలయ చైర్మన్ బొబ్బిళ్ళ మురళి మంగళవారం ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ పురపాలక వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్, కో-ఆప్షన్ సభ్యులు పస్తం గంగరాములు, నూతనంగా ఎన్నికైన ధర్మకర్తలు వరకాల రవి గౌడ్, ఆవుల యేసు యాదవ్, దాడి యశ్వంత్ రెడ్డి, గుగులోతు అరుణ నాయక్, బొబ్బిళ్ళ సామ్రాట్ తదితరులు పాల్గొన్నారు.