హైదరాబాద్, నవంబర్ 27, 2026 (హైదరాబాద్ న్యూస్టైమ్): ప్రయాణ ఖర్చులను తగ్గిస్తూ, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడే వినూత్న ఆలోచనతో హైదరాబాద్కు చెందిన 'వియుగో టెక్మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్' (Viyugo Techmobility Private Limited) సరికొత్త రవాణా యాప్ను అందుబాటులోకి తీసుకువస్తోంది. డిసెంబర్ 6, 2026న ఈ యాప్ను ఘనంగా ప్రారంభించనున్నట్లు సంస్థ ప్రకటించింది.
ఖాళీ సీట్లను పంచుకునే సరికొత్త వేదిక: ప్రతిరోజూ నగరంలోనూ, వివిధ ప్రాంతాల మధ్య అనేక వాహనాలు ఒకే మార్గంలో ఖాళీ సీట్లతో ప్రయాణిస్తుంటాయి. మరోవైపు అదే మార్గంలో వెళ్లేందుకు ప్రయాణికులు వాహనాల కోసం ఎదురుచూస్తుంటారు. ఈ సమస్యకు పరిష్కారంగా, వాహనాల్లో ఖాళీగా ఉన్న సీట్లను తోటి ప్రయాణికులతో పంచుకునే (రైడ్ షేరింగ్) విధానాన్ని ప్రోత్సహించడమే 'వియుగో' ప్రధాన ఉద్దేశం. దీనివల్ల ప్రయాణికులకు ప్రయాణ ఖర్చు తగ్గడంతో పాటు, రోడ్లపై అనవసరంగా తిరిగే వాహనాల సంఖ్య, ట్రాఫిక్ రద్దీ, కార్బన్ డై ఆక్సైడ్ కాలుష్యం గణనీయంగా తగ్గనున్నాయి.
ఒకే యాప్లో ఐదు రకాల సేవలు: వినియోగదారులకు సులభమైన డిజిటల్ ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు ఈ యాప్ ద్వారా ఇంటర్సిటీ (Intercity), ఇన్సిటీ (Incity), రూరల్ రైడ్ (Rural Ride), రెంటల్ (Rental) మరియు పార్శిల్ (Parcel) సేవలను అందించేలా ప్రణాళిక రూపొందించారు.
ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకులు విజయ్ కుమార్ డెంకని మాట్లాడుతూ.. ప్రతి కారులో ఖాళీగా ఉండే సీటును ఉపయోగకరంగా మార్చడం, ప్రయాణికులకు సౌకర్యవంతమైన, సురక్షితమైన ప్రయాణాన్ని అందించడమే తమ ఆశయమని తెలిపారు. "ప్రయాణం పంచుకుందాం.. ఖర్చు తగ్గించుకుందాం.. కాలుష్యాన్ని తగ్గిద్దాం!" అనే నినాదంతో తాము ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు.