ప్రేమ పెళ్లి పేరుతో యువకుడికి కుచ్చుటోపీ.. రూ. 6 లక్షలతో

Published on: 22 Aug 2026, 02:41 AM
News Article

(ఆగస్టు 22, 2026): హైదరాబాద్/కత్తులూరు: ప్రేమ పెళ్లి పేరుతో యువకుడిని నమ్మించి రూ.6 లక్షలు కాజేసి మోసం చేసిన ఘటనలో పులివెందుల వెటర్నరీ విభాగంలో ఉద్యోగం చేస్తున్న ఎస్తర్ రాణిని వేంపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కడపకు చెందిన ఎస్తర్ రాణి, వేంపల్లి మండలం కత్తులూరుకు చెందిన వెంకట ప్రసాద్ రెడ్డి గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువకుడి నుంచి వివిధ అవసరాల నిమిత్తం ఆమె రూ. 6 లక్షల వరకు వసూలు చేసింది. అంతేకాకుండా వివాహం నిమిత్తం ఇద్దరూ కలిసి హైదరాబాద్‌లో పెళ్లి బట్టలు కూడా కొనుగోలు చేశారు. అయితే, పెళ్లి రోజున గండి క్షేత్రంలో వివాహం జరగాల్సి ఉండగా.. తాను పెళ్లి చేసుకుంటే తల్లి ఉరి వేసుకుంటుందని చెప్పి ఎస్తర్ రాణి ఒక్కసారిగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి మోసం చేసింది. బాధితుడు వెంకట ప్రసాద్ రెడ్డి పోలీసులను ఆశ్రయించడంతో, కేసు నమోదు చేసుకున్న వేంపల్లి పోలీసులు నిందితురాలను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.