ఫీజు కోసం విద్యార్థినితో బాత్రూంలు కడిగించిన యాజమాన్యం!

Published on: 09 Apr 2026, 04:00 AM
News Article

తిరుపతి: ఏప్రిల్ 09 (హైదరాబాద్ న్యూస్ టైమ్) ఫీజు కట్టలేదని విద్యార్థినితో బాత్రూంలు కడిగించిన అమానుష ఘటన తిరుపతిలోని శ్రీ వికాస్ నర్సింగ్ కళాశాలలో చోటుచేసుకుంది. నినిత అనే విద్యార్థిని రెండో ఏడాది ఫీజు చెల్లించడం ఆలస్యమైందని యాజమాన్యం ఆమెతో మూడు రోజుల పాటు గోడ కుర్చీ వేయించి, బలవంతంగా బాత్రూంలు కడిగించింది. మొదటి ఏడాది రూ. 2 లక్షలు చెల్లించినా కనికరం లేకుండా వెట్టి చాకిరీ చేయించడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ విషయం వెలుగులోకి రావడంతో విద్యార్థి సంఘాలు కళాశాల వద్ద భారీ ఆందోళన చేపట్టాయి. బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.