ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు.. ప్రభుత్వానికి ఊహించని షాక్!

Published on: 25 Jun 2026, 07:43 AM
News Article

హైదరాబాద్, జూన్ 25 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): ఇంజినీరింగ్ కాలేజీలకు పేరుకుపోయిన వందల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ఎప్పటిలోగా చెల్లిస్తారో స్పష్టమైన తేదీని చెప్పాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు కరాఖండిగా ఆదేశించింది. కాలేజీల బకాయిలు చెల్లించకుండా, అటు విద్యార్థుల నుంచి వసూలు చేసుకోవద్దంటే ప్రస్తుత అడ్మిషన్లు ఎలా ప్రకటిస్తారని, అసలు కాలేజీల నిర్వహణ ఎలా సాధ్యమవుతుందని జస్టిస్ జువ్వాడి శ్రీదేవి తీవ్రంగా ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ నిధుల విడుదల నిబంధనల వల్ల మొత్తం బకాయిల భారం రాష్ట్ర ప్రభుత్వంపైనే పడుతోందని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది రాహుల్ రెడ్డి వివరణ ఇస్తూ కౌంటర్ దాఖలుకు రెండు వారాల గడువు కోరగా, కోర్టు అందుకు నిరాకరిస్తూ బకాయిలపై నిర్దిష్ట తేదీని ప్రకటించాలని ఆదేశిస్తూ విచారణను గురువారానికి వాయిదా వేసింది.