బండి భగీరథ్‌పై లుకౌట్‌ నోటీసులు జారీ!

Published on: 16 May 2026, 07:45 AM
News Article
  • పోక్సో కేసు నిందితుడి కోసం..
  • 5 బృందాలతో పోలీసుల ముమ్మర గాలింపు
  • స్నేహితులు, బంధువుల ఇళ్లపై నిఘా..
  • దేశం దాటకుండా పక్కా ప్లాన్

హైదరాబాద్ న్యూస్ టైమ్, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న పోక్సో (POCSO) కేసులో నిందితుడైన బండి భగీరథ్‌పై హైదరాబాద్ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. బాధితురాలిపై లైంగిక దాడికి పాల్పడ్డాడనే ఆరోపణలపై ఇప్పటికే కేసు నమోదు కాగా, పరారీలో ఉన్న అతని కోసం పోలీసులు 5 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి ముమ్మరంగా గాలిస్తున్నారు. నిందితుడు దేశం దాటి వెళ్లకుండా విమానాశ్రయాలను అప్రమత్తం చేయడంతో పాటు, ప్రస్తుతం అతనితో టచ్‌లో ఉన్న అనుమానితులు, స్నేహితులు మరియు బంధువుల ఇళ్లపై పోలీసులు పక్కా నిఘా ఉంచినట్లు విశ్వసనీయ సమాచారం. రాజకీయంగా మరియు సామాజికంగా తీవ్ర దుమారం రేపుతున్న ఈ కేసులో నిందితుడిని వీలైనంత త్వరగా అదుపులోకి తీసుకునేందుకు ఖాకీ బలగాలు అన్ని మార్గాల్లో వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నాయి.