బండి సంజయ్‌ను మంత్రి పదవి నుండి తొలగించండి!
Published on: 16 May 2026, 06:12 AM
- ప్రధాని, రాష్ట్రపతికి లేఖ రాసిన..
- పోక్సో (POCSO) కేసు బాధితురాలి లాయర్
- పదవిలో ఉంటే కేసును పక్కదారి పట్టిస్తారు..
- న్యాయవాది పప్పు నాగేశ్వరరావు ఆరోపణ
హైదరాబాద్ న్యూస్ టైమ్, హైదరాబాద్: కేంద్రమంత్రి బండి సంజయ్‌ను తక్షణమే మంత్రి పదవి నుండి తొలగించాలంటూ పోక్సో (POCSO) కేసు బాధితురాలి తరపు న్యాయవాది పప్పు నాగేశ్వరరావు ఏకంగా భారత ప్రధాన మంత్రికి, రాష్ట్రపతికి లేఖలు రాయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారింది. బండి సంజయ్ కేంద్రమంత్రి వంటి ఉన్నతమైన రాజ్యాంగ పదవిలో కొనసాగితే తన లాయర్ పవర్‌ను ఉపయోగించి కేసును పూర్తిగా పక్కదారి పట్టించే ప్రమాదం ఉందని ఆయన ఆ లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా, సదరు కేంద్రమంత్రి ఇటీవలే బహిరంగంగా బెదిరింపులకు కూడా దిగారని న్యాయవాది నాగేశ్వరరావు లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. బాధితురాలికి న్యాయం జరగాలన్నా, విచారణ నిష్పక్షపాతంగా సాగాలన్నా బండి సంజయ్‌ను మంత్రివర్గం నుండి తొలగించడం అనివార్యమని ఆయన డిమాండ్ చేయడంతో ఈ వివాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.