బజారు దీక్షిత 13వ జయంతి వేడుకలు.. వృద్ధాశ్రమంలో అన్నదానం

Published on: 10 Sep 2026, 12:19 PM
News Article

ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 10, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడు గ్రామానికి చెందిన బీసీ సంక్షేమ సంఘం రంగారెడ్డి జిల్లా కార్యదర్శి బజారు బిక్షపతి కుమార్తె బజారు దీక్షిత 13వ జయంతి మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. గత ఏడాది కాంపౌండ్ వాల్ కూలిన ప్రమాదంలో అకాల మరణం చెందిన దీక్షిత జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు ఇబ్రహీంపట్నం వినోబానగర్‌లోని మాతా పితా సేవా సదనంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. చిన్న వయసులోనే క్రీడల్లో ప్రతిభ చాటి ఎన్నో బహుమతులు సాధించిన దీక్షిత ఇకలేరనే నిజం తమను ప్రతిక్షణం బాధిస్తోందని తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. ఆమె సేవా కార్యక్రమాల ద్వారా ఎప్పటికీ చిరస్మరణీయమని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు గణం నర్సింహ కురుమ, నాయకులు చిన్నం రఘుపతి కురుమ, నోముల జంగయ్య, శ్రీనివాస్, నవదీప్ తదితరులు పాల్గొని దీక్షిత చిత్రపటానికి నివాళులు అర్పించారు.