బట్టలు ఉతకాలంటే ఇక సర్ఫ్, లిక్విడ్‌తో పనిలేదా? పీఅండ్‌జీ తెచ్చిన ఆ కొత్త టెక్నాలజీ ఏంటో తెలుసా!

Published on: 23 Jun 2026, 02:51 AM
News Article

న్యూయార్క్, జూన్ 22 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): బట్టలు ఉతికే విధానంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలన్న లక్ష్యంతో ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ (FMCG) దిగ్గజం 'ప్రాక్టర్ అండ్ గ్యాంబిల్' (P&G) దశాబ్ద కాలం పాటు చేసిన పరిశోధనలు ఎట్టకేలకు ఫలించాయి. లాండ్రీ (బట్టలు ఉతకడం) భవిష్యత్తు ఎలా ఉండబోతోందన్న ప్రశ్నకు సమాధానంగా కంపెనీ ఒక సరికొత్త ఆవిష్కరణను ప్రపంచానికి పరిచయం చేసింది. అదే 'టైడ్ ఎవో' (Tide evo) అనే డిటర్జెంట్ 'టైల్'. సాధారణంగా మనం వాడే సర్ఫ్ (పౌడర్) లేదా లిక్విడ్ డిటర్జెంట్లకు పూర్తి భిన్నంగా.. ఇది ఒక చిన్న 'టైల్' (బిళ్ళ లేదా ఫ్యాబ్రిక్ ముక్క) ఆకారంలో ఉంటుంది. ఎలాంటి ప్లాస్టిక్ ప్యాకేజింగ్ అవసరం లేకుండా, నీటిలో వేయగానే సులభంగా కరిగిపోయి మురికిని వదిలించేలా దీన్ని అత్యంత ఆధునిక సాంకేతికతతో రూపొందించారు. భవిష్యత్తులో పౌడర్, లిక్విడ్ డిటర్జెంట్ల స్థానాన్ని ఈ పర్యావరణ హితమైన 'టైడ్ ఎవో' టైల్స్ పూర్తిగా భర్తీ చేయనున్నాయని కంపెనీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.