బాల్క సుమన్ కుటుంబ సభ్యులకు బీఆర్ఎస్ నేతల పరామర్శ

Published on: 20 Jun 2026, 03:16 AM
News Article

హైదరాబాద్, జూన్ 20 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): సింగరేణి సంస్థలో జరిగిన అవినీతి, అక్రమాలను ప్రశ్నించి బయటపెట్టినందుకు గానూ కాంగ్రెస్ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతూ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై అక్రమ కేసులు బనాయించి జైల్లో నిర్బంధించిన నేపథ్యంలో.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిశోర్ కుమార్ తదితరులు సుమన్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. శనివారం స్వయంగా బాల్క సుమన్ నివాసానికి వెళ్లిన బీఆర్ఎస్ నేతలు, ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడి మనోధైర్యం కల్పించారు. అక్రమ కేసులకు భయపడేది లేదని, సుమన్‌తో పాటు ఆయన కుటుంబానికి పార్టీ పక్షాన సంపూర్ణ అండగా ఉంటామని ఈ సందర్భంగా కేటీఆర్, గాదరి కిశోర్ కుమార్ భరోసా ఇచ్చారు.