బీఆర్ఎస్ సీనియర్ నేత క్యామ మల్లేశం కురుమను పరామర్శించిన కేవైసీఎస్ నాయకులు
హైదరాబాద్, ఆగస్ట్ 12, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): బీఆర్ఎస్ భువనగిరి పార్లమెంట్ ఇన్‌చార్జ్ క్యామ మల్లేశం కురుమ అనారోగ్యంతో మలక్‌పేట్ యశోద హాస్పిటల్‌లో చికిత్స పొంది ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కురుమ యువ చైతన్య సమితి (KYCS) ఎల్బీనగర్ నియోజకవర్గం అధ్యక్షులు కాల్నే మల్లేశం కురుమ, వర్కింగ్ ప్రెసిడెంట్ బాలం శ్రీనివాస్ కురుమ, సివిల్ ఇంజనీర్ బుగ్గ పరంధామ కురుమ తదితరులు ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆయన త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కేవైసీఎస్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గొరిగే నరసింహ కురుమ, ప్రధాన కార్యదర్శి గౌడరాజు కుమార్ కురుమ, వర్కింగ్ ప్రెసిడెంట్ కానుగంటి వెంకటేష్ కురుమ, కోశాధికారి రావుల ఐలయ్య కురుమ, కొల్లు రమేష్ కురుమ, ప్రచార కార్యదర్శి బండ శ్రీకాంత్ కురుమ, కోడూరు అశోక్ కురుమ, కార్యదర్శి మందుల సైదులు కురుమ, కేమిడి సత్యనారాయణ కురుమ, గణం నరసింహ కురుమ తదితరులు పాల్గొన్నారు.