బోడుప్పల్ భూ పోరాట ప్రాంతంలో ఉద్రిక్తత: కవిత అరెస్ట్
Published on: 02 Jul 2026, 05:30 AM
బోడుప్పల్, జూలై 02, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): బోడుప్పల్‌లోని భూ పోరాట ప్రాంతంలో ఈరోజు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆ ప్రాంతాన్ని 'తెలంగాణ ఉద్యమకారుల రక్షణ కాలనీ'గా నామకరణం చేసి, బొడ్రాయిని ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు అక్కడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె పర్యటనను అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులకు, తెలంగాణ రక్షణ సేన కార్యకర్తలకు మధ్య తీవ్ర తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తూ, చివరకు కల్వకుంట్ల కవితను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో భారీగా పోలీసులను మోహరించడంతో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.