భద్రాచలం పద్మశాలి భవన్ ధర్మకర్తలుగా గోశిక వినయ్ కుమార్, బడుగు రవికుమార్ ఏకగ్రీవ ఎన్నిక
Published on: 24 Jul 2026, 04:36 PM
భద్రాచలం, జూలై 24, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): భద్రాచలంలోని అఖిలభారత భక్త మార్కండేయ పద్మశాలి భవన్ ధర్మకర్తలుగా చౌటుప్పల్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్ మరియు చౌటుప్పల్ మండల కేంద్రానికి చెందిన బడుగు రవికుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శ్రీ సీతారామచంద్రస్వామి ఆశీర్వాదంతో ఈ పదవికి ఎంపిక కావడం చాలా ఆనందంగా ఉందని వారు తెలిపారు. తమ ఎన్నికకు సహకరించిన అఖిలభారత పద్మశాలి అన్నదాన సత్రం అధ్యక్షుడు గోశిక యాదగిరి, మార్గదర్శకులు చిలువేరు కాశీనాథ్ తదితరులకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. నూతన ధర్మకర్తలుగా ఎన్నికైన గోశిక వినయ్ కుమార్, బడుగు రవికుమార్‌లకు చౌటుప్పల్ పద్మశాలీ సంఘం సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు.