భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: నారాయణపురం ఎస్ఐ పాండు

Published on: 29 Jul 2026, 01:32 PM
News Article

సంస్థాన్ నారాయణపురం, జూలై 29, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని నారాయణపురం పోలీస్ స్టేషన్ ఎస్ఐ పాండు హెచ్చరించారు. అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని, ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాలు, తెగిపోయిన తీగల కింద నిలబడవద్దని సూచించారు. వరద నీరు ప్రవహించే ప్రాంతాలు, కాలువలు, వాగుల వైపు వెళ్లవద్దని, పిల్లలను వాటికి దూరంగా ఉంచాలని కోరారు. నీరు నిలిచిన రోడ్లపై వాహనాలను అత్యంత జాగ్రత్తగా నడపాలని, వాతావరణ శాఖ మరియు పోలీసుల హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని పేర్కొంటూ.. ఏదైనా ఆపద లేదా అత్యవసర సహాయం కావాలంటే వెంటనే పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని ఎస్ఐ విజ్ఞప్తి చేశారు.