మద్యం తాగించి.. బలవంతం చేసి!
Published on: 16 May 2026, 03:29 AM
- “బండి భగీరథ్ నా కూతురిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు”
- కేసు నమోదులో పోలీసుల తాత్సారం చేశారని ఆరోపణ
హైదరాబాద్ న్యూస్ టైమ్, హైదరాబాద్: తన కూతురిపై బండి భగీరథ్ లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలి తల్లి తీవ్ర ఆరోపణలు చేశారు. మద్యం తాగించి బలవంతంగా దారుణానికి ఒడిగట్టాడని ఆమె వెల్లడించారు. ఈ ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు కేసు నమోదు విషయంలో తాత్సారం చేశారని ఆరోపించారు.
ఈ మేరకు బాధితురాలి తల్లి శనివారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఘటన అనంతరం కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని తెలిపారు. మహిళా సంఘాలు, స్థానిక ప్రజలు ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధితురాలికి రక్షణ కల్పించడంతో పాటు కేసును వేగంగా దర్యాప్తు చేయాలని కోరుతున్నారు. పోలీసులు మాత్రం ఫిర్యాదు ఆధారంగా విచారణ కొనసాగుతోందని వెల్లడించినట్లు సమాచారం.