మళ్ళీ కలవబోతున్న 'భజరంగీ భాయ్‌జాన్' జోడీ!
Published on: 04 May 2026, 05:20 PM
హైదరాబాద్ న్యూస్ టైమ్ | మే 04, 2026 ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ త్వరలో చేయబోతున్న భారీ బడ్జెట్ సూపర్ హీరో సినిమాలో కరీనా కపూర్ ఖాన్ హీరోయిన్‌గా నటించనున్నట్లు సమాచారం. ఇప్పటికే 'భజరంగీ భాయ్‌జాన్', 'బాడీగార్డ్' వంటి బ్లాక్ బస్టర్ హిట్లను అందుకున్న ఈ జోడీ, దాదాపు దశాబ్దం తర్వాత మళ్ళీ కలిసి నటించబోతుండడం సినీ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని, కరీనా పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతుందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే, సల్మాన్-కరీనా అభిమానులకు ఇది పెద్ద పండుగే అని చెప్పాలి.